.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

కుక్కే సుబ్రహ్మణ్య స్వామి. ఆలయ స్థలపురాణం



కుక్కే సుబ్రహ్మణ్య స్వామి.

ఆలయ స్థలపురాణం




ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి. కుమారస్వామి (సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కార్తికేయుడు) కి నిలయమైన ఈ క్షేత్రం ‘పరశురామ’ క్షేత్రాలలో ఒకటి.




కుమారధారా నది మీద వున్న సుబ్రహ్మణ్య స్వామి వూళ్ళో వున్న సుబ్రహ్మణ్య దేవాలయం లేక కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం చూసి తీరవలసిన వాటి లో ఒకటి. ఈ గుడి చుట్టూ నదులు, పర్వతాలు, అడవులు. ముఖ్యంగా కుమార పర్వతమీద పరుచుకుని వుంటాయి. ఈ గుడి శివుడి రెండో కుమారుడు, కార్తికేయుడు గా పిలవబడే సుబ్రహ్మణ్య స్వామికి, నాగ రాజు వాసుకి కి నిలయం.




ఈ ఆలయం ప్రాకృతిక సౌందర్యారాలు వెలువరించే కర్ణాటక రాష్ట్రం, దక్షిణ కన్నడ జిల్లాలో మంగళూరుకు 100 కి.మీ.ల దూరంలో కుమార పర్వతశ్రేణుల మధ్య ధారా నది ఒడ్డున ఉన్న గ్రామం ’సుబ్రహ్మణ్యం’లో వుంది. పూర్వం ఈ గ్రామాన్ని ‘కుక్కే పట్నం’ అనే పిలిచేవారు. క్రమంగా ఇది ‘కుక్కె సుబ్రహ్మణ్య’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్‌కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.




స్థలపురాణం : పూర్వం తారకుడు, సూర్పర్మాసురా అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. తన ఆయుధాన్ని ఇక్కడి (కుక్కే సుబ్రహ్మణ్య గ్రామంలో) ధారానదిలో శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు. ఆ తరువాత వాసుకి తపస్సుకు మెచ్చి వాసుకి కోరికపై ఈ ప్రదేశంలో తనతో పాటు వెలియడానికి అంగీకరించడం వల్ల ఈ క్షేత్రం వెలసింది.




సుబ్రహ్మణ్యస్వామి ముఖద్వారం తూర్పుముఖమై ఉన్నా, భక్తులు మాత్రం పృష్టభాగం నుండి ముందుకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. గర్భగుడికి, ఈమధ్య నిర్మించబడ్డ వసారాకు మధ్యన వెండితాపడాలతో అలంకరింపబడ్డ స్తంభం ఉంటుంది. వాసుకి విషపు బుసలనుండి రక్షింపపడడానికి ఈ స్తంభాన్ని నిర్మించారు అని ప్రతీతి. ఈ స్తంభాన్ని దాటిన తరువాత లోపటి మంటపం చేరుకోగానే గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు సాక్షాత్కరిస్తాడు. పైభాగంలో సుబ్రహ్మణ్యస్వామి , మధ్యభాగంలో వాసుకి, కింద్రిభాగంలో ఆదిశేషు ఉంటారు.




ఈ దేవాలయానికీ వెనుక వైపు ఆదిశేషువు పుట్టలో కోలువై యున్నాడు. ఇక్కడ సర్పాలు స్వేచ్చగా స్వామీ సన్నిది లో తిరుగుతూ ఉంటాయి. ఏవరి జోలికి రావు.




సర్ప దోష శాంతికి చేసే ప్రక్రియలకు ఈ పవిత దేవాలయం ప్రసిద్ది. ఈ గుడిలోని ప్రధాన పర్వ దినం తిపూయం నాడు అనేకమంది యాత్రికులు ఇక్కడికి వస్తారు. దీంతో పాటు ఆశ్లేష బలి పూజ, సర్ప సంస్కారం అనే మరో రెండు ప్రధానమైన సర్ప దోష పూజలు కూడా ఈ గుడిలో చేస్తారు.




ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ నలమూలల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తారు. పూర్వం ‘ఆది శంకరాచార్యులు’ తన ధర్మ ప్రచార పర్యటనలో భాగంగా సుబ్రహ్మణ్యను దర్శించారు. ఆయన విరచించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ‘నమస్తే సదా కుక్కుటేశోగ్ని కేతా స్స్మస్తాపరాధం విభోమే క్షమస్వ’ అని పేర్కొన్నారు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML