.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం



#అర్జునుని #నామములు

అర్జునుని నామములు మనం సహజంగా పిడుగులు పడుతున్నపుడు చదువుతాము. ఆ సమయం లో ఈ పది నామములు చదివితే మనకు దగ్గరలో పిడుగులు పడవు అని సక్షాత్తు ఇంద్రుడే చెప్పాడు అని చెప్తారు. ఇప్పుడు అట్టి పది నామముల గురించి తెలుసుకుందాం!

1) అర్జున : కన్నులకు సొంపైన,
సుందరమైన శరీర కాంతి కలవాడు


2) ఫల్గుణ : పూర్వ ఫల్గుణ, ఉత్తర
ఫల్గుణ నక్షత్రముల మద్య
సంధ్య కాలమున పుట్టినవాడు

3) పార్ధ : పృధ (కుంతీదేవి అసలు
పేరు) కు జన్మించిన వాడు

4) కిరీటి : ఇంద్రుని చేత ప్రసాదించిన
కిరీటం కలిగినవాడు

5) శ్వేతవాహన : తన రధానికి
ఎల్లప్పుడూ తెల్లని
గుర్రములు కలిగిఉండే వాడు

6) భీభత్స : యుధం చేస్తున్నప్పుడు
సర్వం మర్చిపోయి అతనిని
చూడాలనిపించే కౌశలం కలవాడు

7) విజయ : ఓటమి తెలియని వీరుడు

8) జిష్ణ : తాను ఆయుధం పట్టి ఉండగా
తన అన్నధర్మరాజు మీద ఎవరైనా
బాణప్రయోగం చేస్తే వారిని
సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసాడు
కనుక జిష్ణుడు

9) సవ్యసాచి : రెండుచేతులతో బాణ
ప్రయోగం చేయగలిగిన వాడు

10) ధనుంజయ : రాజసూయ యాగ
సమయం లో సర్వ రాజ్యములను
గెలిచి ధనమును తెచ్చిన వాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML