.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

5, మార్చి 2018, సోమవారం

నందిని



#నందిని
వసిష్టుని కామధేనువు పేరు నందిని. ఈ నందిని కారణం గానే వశిష్టుడు, విశ్వామిత్రులకు విబేధాలు వచ్చాయి. ఈ నందిని కారణం గానే వశిష్టుడు అష్టవసువులను మనుష్యజన్మను స్వీకరించండి అని శపించటం కుడా జరిగింది.

నందిని ఎవరు? వశిష్టునికి నందిని ఎలా లభించినది?


వశిష్టుడు వరుణ దేవుని పుత్రుడు. ఆతని ఆశ్రమం మేరుపర్వత ప్రాంతం లో ఉంది. అక్కడ అన్ని మృగ పక్షి జాతులు కుడా సహజమైన జాతి వైరం లేకుండా కలసి మెలసి ఉంటాయి. ఆ వనం సర్వఫల పుష్పములతో ఉంటుంది. ఆ వశిష్టుడు ఆ వనం లో గొప్ప తపస్సు చేసాడు.

దక్ష ప్రజాపతి పుత్రికలలో ఒక అమ్మాయి పేరు సురభి. ఆ సురభి ని దక్షప్రజాపతి కస్యపునికి ఇచ్చి వివాహం జరిపించాడు. వారికి గోసంతానం కలిగింది. ఆ గోవుకు వారు నందిని అని నామకరణం చేసారు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు. కొంతకాలానికి ఈ నందిని వశిష్టమహర్షి వద్దకు చేరింది. వశిష్టుడు ఈ నందినిని చాల ప్రేమగా చూసుకునేవాడు. నందిని అతనికి హోమధేనువుగా ఉంది. ఆ నందిని అతని ఆశ్రమం లో స్వేచ్చగా తిరుగుతూ ఉంటుంది.

అష్ట వసువులకు శాపం:
ఒక రోజు అష్టవసువులు వారి వారి భార్యలతో సహా విహారానికి వచ్చినప్పుడు వశిష్టుని ఆశ్రమంలో నందినిని చూసారు. వారు వసువులు కావటం వల్ల వారికి నందిని గొప్పతనం తెలిసింది. ఆమె కామధేనువు అని, ఆమె పాలు త్రాగినంతమాత్రాన నిత్యయవ్వనం కలుగుతుందని వారు మాట్లడుకుoటుండగా, చిన్నవాడయిన వసువు ప్రభాసుని (ద్యూ) భార్య అదివిని తనభార్తతో మాట్లాడింది.
"ఓ ప్రియా! నా స్నేహితురాలు జితవతి ఉసీనర రాజకుమార్తె. ఆమె మనిషికావున ఆమెకు ఈ నందిని ని మనం ఇస్తే ఈ నందిని పాలు త్రాగుటవల్ల ఆమెకు నిత్య యవ్వనం కలుగుతుంది, ఆమె సంతోషిస్తుంది. కనుక తమరు నాకు ఆ గోవును తెచ్చిఇవ్వగలరా!"
భార్య కోరిక విన్న ప్రభాసుడు, తన ఆలోచన తప్పు అని కాని, దాని తర్వాత వచ్చే పరిణామాల గురించి కాని ఆలోచించక తన అన్నల సహకారం తో నందినిని అపహరించాడు. ఈ విషయం తెలుసుకున్న వశిష్టుడు వీరు ఎనిమిది వసువులూ కుడా లోభిత్వం ఎక్కువగా ఉండే మనుష్య జన్మలో జన్మించవలసినది అని శపించాడు.
తమ తప్పు తెలుసుకున్న వసువులు శాపవిమోచనం తెలుపమనగా శాంతించిన మహర్షి తప్పు చేసిన చిన్నవాడయిన ప్రభాసుడు మాత్రం దీర్ఘయుర్దాయం కలిగి ఉండవలసినది అని, మిగిలినవారు ఒకొక్క సంవత్సరం తేడాతో తమతమ నిజ రూపములు పొందగలరు అని చెప్పాడు.
ఆ అష్టవసువులు తరువాతి కాలం లో శంతనుడు, గంగలకు జన్మించారు. ఒక్క భీష్ముడు తప్ప మిగిలిన వారు పుట్టిన వెంటనే తమ తల్లి ఐన గంగ సహకారం తో శరీరాలను వదిలి నిజ రూపాన్ని పొందారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML