సామ్బో నః కులదైవతం పశుపతే
సామ్బ త్వదీయా వయం
సామ్బం స్తౌమి సురాసురోరగగణాః
సామ్బేన సన్తారితాః ।
సామ్బాయాస్తు నమో మయా విరచితం సామ్బాత్పరం నో భజే
సామ్బస్యానుచరోఽస్మ్యహం మమ రతిః సామ్బే పరబ్రహ్మణి ॥
సాంబుడే (జగదంబయగు పార్వతితో కూడిన శివుడు) మా కులదైవము . జీవులను పాలించు ఓ సాంబా! మేము నీవారిమే. సాంబునే స్తుతించుచున్నాను. దేవ - రాక్షస - సర్పగణములు సాంబుని చేతనే తరింపచేయబడినవి. నేను సాంబునకు నమస్కరించుచున్నాను.సాంబుని కంటే ఇతరుని పూజించను. నేను సాంబుని భక్తుడను. పరమాత్మయగు సాంబునియందే నాకు అనురాగము.
ॐ నమో నమో నమఃశివాయ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి