.

.
What's app followers 7093879327

గమనిక :

ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .మరింత సమాచారం మీకు అందుబాటులో ఉంచుటకు "తెలుగుబంధు2", అందుబాటులో ఉంది, దానిపై నొక్కి మరింత సమాచారం పొందకలరు

సర్వేజనా సుఖినో భవంతు , లోకా సమస్తా సుఖినోభవంతు

18, మార్చి 2018, ఆదివారం

వేదం - అనుగ్రహం

వేదం - అనుగ్రహం

పరమాచార్య స్వామివారు సాక్షాత్తు దైవస్వరూపులు. కలియుగంలో వైదిక ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన అపర శంకరావతారులు. మా తండ్రిగారికి పరమాచార్య స్వామివారు తప్ప వేరు దైవము లేదు. స్వామివారి ఉపదేశం విని మా ముగ్గురు అన్నదమ్ములను వేదసేవకే వినియోగించారు. వేదపండితుడైన యువకునికే మా చెల్లిని ఇచ్చి కన్యా వివాహం చేశారు. అలాగే, వారి ఇష్టానుసారమే మా అన్నకు నాకు కూడా కన్యా వివాహమే చేశారు. 

నేను వేదపాఠశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడు రెండు మూడు రోజులు వరుసగా సెలవు వస్తే, మా గురువు గారు మమ్మల్ని మహాస్వామివారి వద్దకు "స్వామివారి సమక్షంలో వేదం చెప్పండి" అని పంపేవారు. అప్పుడు మహాస్వామివారు మా అహార విహారాదుల గురించి అన్ని విషయాలు అడిగేవారు. ఆంధ్రదేశ పర్యటనప్పుడు నేను వారితో పాటు కార్వేటి నగరం, బుక్క, రామగిరిలో ఉన్నాను. స్వామివారు నన్ను అనుగ్రహించి బ్రహ్మశ్రీ గోదా మంత్రాలయం వద్దకు పంపారు. తరువాత నేను తిరుపతిలో వేదపారయణదార్ ఉద్యోగానికి అర్జీ పెడితే స్వామివారి అనుగ్రం వల్ల పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాను. స్వామివారి అనుమతితో వెళ్దామని చెప్పడానికి వారి వద్దకు వెళ్ళాను. అనుకోకుండా స్వామివారు వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చారు. ఆశ్శీపూర్వకంగా నాచేతిలో ఒక కమలం పెట్టారు. ప్రేమతో వారు నాతో, "శాస్త్రాన్ని ఉల్లంఘించకుండా నీ కర్తవ్యం నిర్వర్తించు. ఒకవేళ శాస్త్రాన్ని ధిక్కరించవలసిన పరిస్థితి వస్తే, ఉద్యోగం వదిలేసి నావద్దకు రా. నీ బాధ్యత నేను తీసుకుంటాను" అని అన్నారు. 

చిన్న కాంచీపురంలోని మహాస్వామి వారి వేదపాఠశాలలో నేను వేదం నేర్చుకున్నాను. అక్కడ నేను విద్యార్థిగా ఉన్నప్పుడు మాకు భోజన సదుపాయాలు అంతగా ఉండేవి కావు. కనుక స్వామివారు భక్తులను ప్రతి నెలా తమ జన్మనక్షత్రం రోజున ఏవైనా మధుర పదార్థాలు, తినుబండారలు చేసి తనకు చూపించి వేదపాఠశాలలో ఇమ్మని చెప్పారు. భక్తులు అలాగే చేసేవారు. మేము పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారు మమ్మల్ని ప్రేమపూరిత మాటలతో అడిగేవారు, "ఈరోజు తినుబండారాలను ఎవరు తీసుకొనివచ్చారు?" అని. ఫలనా వారు మీకు ఈరోజు మధుర పదార్థాలు తెచ్చారా? అని ప్రేమగా అడిగేవారు. దాన్ని తలచుకోవడం ఇప్పటికి ఒక మధురానుభూతి. 

పరమాచార్య స్వామివారి కటాక్షం పొందాలంటే విశేషంగా ఏమీ చెయ్యనక్కరలేదు. వేదం పఠిస్తే పరమాచార్య స్వామివారు వారంతట వారే వచ్చి మనల్ని అనుగ్రహిస్తారు. "మంత్రాదీనంతు దైవతం" అంటే దేవతలు మంత్రం యొక్క ఆధీనంలో ఉంటారు అన్నట్టు మనం వేద పారాయణం మొదలుపెట్టగానే వారే స్వతహాగా మనం కూర్చున్న చోటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. 

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- శ్రీ కె. చంద్రశేఖర ఘనాపాటి, న్యాయ - వేదాంత శిరోమణి, తిరుపతి. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్

Virus-free. www.avast.com

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Powered By Blogger | Template Created By Lord HTML